Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడే సిద్ధమైపోయిన వైఎస్ జగన్ నేమ్ ప్లేట్... సోషల్ మీడియాలో వైరల్!

  • జగన్ సీఎం అంటూ నేమ్ ప్లేట్
  • షేర్ చేస్తున్న వైసీపీ కార్యకర్తలు
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోమారు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారా? లేక విపక్ష నేత వైఎస్ జగన్ సీఎం అవుతారా? అన్నది మరో 38 రోజులు గడిస్తేగాని చెప్పలేము. అయినప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయం సాధించేది తామేనని ఘంటాపథంగా చెబుతున్నారు.

సీఎంగా జగన్ రానున్నారని అంటూ, ఆయన పేరిట నేమ్ ప్లేట్ ను తయారు చేయించి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు" అంటూ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కనిపిస్తున్న నేమ్ ప్లేట్ ఇప్పుడు తెగ షేర్ అవుతోంది. నిన్నటికి నిన్న చంద్రబాబు, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ మార్ఫింగ్ ఫోటోను షేర్ చేయగా, అది కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Jagan
Name Plate
CM
Viral

More Telugu News